: భారత్ 503 ఆలౌట్
హైదరాబాద్ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 503 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ పై 266 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓవర్ నైట్ స్కోరు 311/1 తో మూడో రోజు ఆట ఆరంభించిన భారత్ తొలి సెషన్ లో కాసింత దూకుడు కనబర్చింది. పుజారా (204) కెరీర్లో రెండో డబుల్ సెంచరీ సాధించగా, ఓపెనర్ విజయ్ 167 పరుగులు నమోదు చేశాడు.
వీరిద్దరూ రెండో వికెట్ కు 370 పరుగులు జత చేయడం విశేషం. ఈ జోడీ అవుటవడంతో భారత్ పతనం మొదలైంది. కేవలం 99 పరుగుల తేడాతో మిగతా 7 వికెట్లను చేజార్చుకుంది. ఆసీస్ బౌలర్లలో మాక్స్ వెల్ 4 వికెట్లు తీశాడు. ఈ ఇన్నింగ్స్ లో సచిన్ 7 పరుగులు మాత్రమే చేసి ప్యాటిన్సన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.