: పార్టీ శ్రేణులకు కర్తవ్యబోధ చేసిన జగన్
భారీ వర్షాలతో అతలాకుతలం అయిన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఈ ఉదయం హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యనేతలతో జగన్ వర్షాల విషయమై చర్చించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని కార్యకర్తలకు సూచించారు. నిలువనీడ కోల్పోయిన వారిని తక్షణమే ఆదుకోవాలని స్పష్టం చేశారు.