: ప్రేమా.. అమ్మో..! శృంగారమా.. వామ్మో..!


జపాన్ లో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి బ్రహ్మచర్యం! దీని కారణంగా గత దశాబ్ద కాలంగా జపాన్ జనాభా క్షీణించిపోతోంది. ఇప్పుడు జపాన్ జనాభా 12.6 కోట్లు కాగా.. 2050 నాటికి జనాభా మరింత తగ్గనుందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే జపాన్ అంతరించిపోయే ప్రమాదముందంటూ జపాన్ ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ అధిపతి కునియో కిటమొర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జపాన్ లో 40 ఏళ్లలోపు యువతను పట్టిపీడిస్తున్న రుగ్మత ఘోటక బ్రహ్మచర్యం. దీంతో, దీనికి 'సెలిబసీ సిండ్రోమ్' అని పేరు కూడా పెట్టేశారు ఆ దేశ ఫ్యామిలీ నిపుణులు. అభద్రతా భావం కారణంగా ఆ దేశ యువత ప్రేమంటే ఆమడ దూరం పారిపోతున్నారు. పోనీ శృంగారమో... అని అంటే వామ్మో అని జడుసుకుంటున్నారట.

స్త్రీలలో 40 శాతం, పురుషుల్లో 30 శాతం మంది ప్రేమ, శృంగారంపై తీవ్ర విముఖత చూపుతున్నారట. ఇందుకు ప్రధాన కారణం జీవనవ్యయం పెరిగిపోవడమేనని పలు సర్వేలు చెబుతున్నాయి. జపాన్ లో సౌకర్యవంతంగా బ్రతకాలంటే ఒక వ్యక్తి సంపాదన సరిపోవడం లేదు. అదీ కాక, అక్కడ స్థిర(గవర్నమెంటు) ఉద్యోగాలు కాదట. ప్రేమ, పెళ్లి కారణంగా బాధ్యతలు పెరగనున్న నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోతే..? అనే అభద్రతా భావం పెరిగిపోతోంది. దీని కారణంగా స్త్రీ, పురుషులు సంపాదనా యంత్రాలుగా మారిపోయారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు పెళ్లి చేసుకున్న మహిళలకు ఉద్యోగాలు నిరాకరిస్తున్నాయనే కారణం కూడా బ్రహ్మచర్యానికి ప్రేరేపిస్తోందట.

వివాహితులను ఉద్యోగాలకు ఎంచుకుంటే కుటుంబ బంధాలు, బాధ్యతలకు విలువనిచ్చి పనిని నిర్లక్ష్యం చేస్తారని వారిని ఎంచుకోవడం లేదట. అలాగే, మరి కొన్ని కార్పొరేట్ సంస్థల్లో వివాహితులకు ఇంక్రిమెంట్లు, బోనస్ లు, ప్రమోషన్లు నిలిచిపోయే అవకాశముందట. దీని కారణంగా జపాన్ యువత కెరీర్ కు పెద్దపీట వేసి, ప్రేమ, పెళ్లి, శృంగారం అంటే జడుసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News