: సింగరకొండ ఆలయంలోకి ప్రవేశించిన వరద నీరు
ప్రకాశం జిల్లా సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలోకి వరదనీరు ప్రవేశించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీపంలోని భవనాసి చెరువు పొంగిపొర్లుతుండడంతో వరదనీరు ఆలయంలోకి చేరింది. చెరువు నీరు ఆలయం వైపు రాకుండా రక్షణ గోడను ఏర్పాటు చేయాలని ఆలయ సిబ్బంది అధికారులను కోరుతున్నారు. కాగా, ఆలయంలోకి ప్రవేశించిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నారు. హుండీలోకి నీళ్ళు చేరడంతో భక్తులు వేసిన నగదు కానుకలు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో, ఇస్త్రీపెట్టె సాయంతో నోట్లను ఆరబెట్టి, అనంతరం వాటిని లెక్కిస్తున్నారు. ఇక, స్వామివారికి పూజారులు వర్షపునీటిలోనే పూజాదికాలు నిర్వహించారు.