: రాహుల్ తో కలిసి పనిచేసే ప్రశ్నే లేదు: పవార్
కేంద్ర మంత్రి శరద్ పవార్.. కాంగ్రెస్ భావి ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ తో కలిసి పనిచేసే ప్రశ్నే లేదన్నారు. మీడియా రాహుల్ విషయాన్ని పవార్ వద్ద ప్రస్తావించగా, ఆయన భిన్నంగా స్పందించారు. మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో రాహుల్ చేరాలని, ఆ అనుభవం రాహుల్ కు తప్పకుండా లాభిస్తుందని అన్నారు. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించబోనని చెప్పారు. రాహుల్ తో కలిసి పనిచేయడాన్ని ఇబ్బందిగా భావిస్తారా? అని మీడియా అడగగా.. తాము కలిసి పనిచేసే ప్రశ్నే లేదని, తమ మధ్య తరాల అంతరమని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండూ మెజారిటీ సాధించలేవని, బీజేపీకి మాత్రం కొద్దిగా ఎక్కువ సీట్లు రావచ్చన్నారు. తాను కాంగ్రెస్ తో ఉన్నానని, భవిష్యత్తులోనూ కాంగ్రెస్ తోనేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు.