: ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని మత ఘర్షణలు..


దేశంలో మత ఘర్షణల పరంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. నాలుగో స్థానంలో ఉన్న కర్ణాటక దక్షిణాదిన మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం 2010 జనవరి నుంచి 2013 మార్చి వరకు కర్ణాటకలో 222 మత ఘర్షణలు జరిగాయి. ఇదే కాలంలో దేశవ్యాప్తంగా 2,120 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో 347 మత అల్లర్లు, మధ్యప్రదేశ్ లో 326, మహారాష్ట్రలో 299 జరిగాయి. కేరళలో 126, ఆంధ్రప్రదేశ్ లో 114, తమిళనాడులో 86 మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

  • Loading...

More Telugu News