: బాయ్-గుత్తాజ్వాల వ్యవహారంలో వీరప్ప మొయిలీ జోక్యం


డబుల్స్ క్రీడాకారిణి గుత్తాజ్వాలపై జీవితకాల నిషేధం విధించాలంటూ 'బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'(బాయ్) క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ జోక్యం చేసుకున్నారు. ఈ మేరకు క్రీడాశాఖ మంత్రి జితేంద్ర సింగ్ కు లేఖ రాశారు. క్రీడాకారుల విషయంలో పారదర్శకంగా ఉండాలని, ముఖ్యంగా జ్వాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని లేకుంటే కేంద్రం నుంచి క్రీడాశాఖకు ఇస్తున్న నిధులను కోల్పోవలసి ఉంటుందని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా కింద జ్వాల భారత్ పెట్రోలియంలో ఉద్యోగి. దాంతోనే, ఆమె విషయంలో మొయిలీ కలుగజేసుకున్నట్లు తెలుస్తోంది. జ్వాల పట్ల 'బాయ్' వ్యవహరించిన తీరు సరిగాలేదని మొయిలీ తన లేఖలో పేర్కొన్నారు. జ్వాల అంశంలో ఒక చిన్న విషయాన్ని ఇంత పెద్ద సమస్యగా చిత్రీకరించడం సరికాదన్నారు. వెంటనే క్రీడాశాఖ జోక్యం చేసుకుని వ్యవహారాన్ని సరిదిద్దాలని హితవు చెప్పారు.

  • Loading...

More Telugu News