: 'అభయ'కు ముందూ కొందరిపై డ్రైవర్ అత్యాచారాలు
ఇటీవల మాదాపూర్ లో 22 ఏళ్ల ఐటీ ఉద్యోగినిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ డ్రైవర్ సతీశ్ గతంలోనూ ఇలానే పలువురిపై దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ సతీశ్ మాదాపూర్ ప్రాంతంలోనే గతంలోనూ కొందరిని కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపి ఉంటాడని, అవి బయటకు రాకపోయేసరికి, మరింత ధైర్యంతో అభయపై అత్యాచారానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. విచారణలో భాగంగా సతీశ్ కొన్ని వారాల ముందు ఒక అమ్మాయిని ఎక్కించుకుని అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. అయితే, ఆ అమ్మాయి వ్యభిచారిణి అని సతీష్ చెప్పాడు. ఈ నేపథ్యంలో.. సతీశ్, అతని మిత్రుడు వెంకటేశ్వర్లు గతంలో చేసిన దారుణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.