: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను కాల్చి చంపిన ఢిల్లీ పోలీసులు


ఎంతో కాలంగా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నీతూ దొబాడియాను ఢిల్లీ పోలీసులు కాల్చి చంపారు. దొబాడియాపై ఏడు లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. స్థానిక హయట్ హోటల్ వద్ద జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో దొబాడియాతో పాటు అతని కుడి భుజం అలోక్, మరో గ్యాంగ్ సభ్యుడు కూడా అక్కడికక్కడే మరణించారు. దొబాడియా గ్యాంగ్ కు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదు. దొబాడియాపై కాంట్రాక్ట్ మర్డర్లు, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం లాంటి క్రిమినల్ కేసులు అనేకం ఉన్నాయి.

  • Loading...

More Telugu News