: రేపు 'సమైక్య శంఖారావం' సభ జరుగుతుంది: కొణతాల


వైఎస్సార్సీపీ రేపు హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన 'సమైక్య శంఖారావం'సభ జరుగుతుందని, ఆ నిర్ణయంలో మార్పేమీ లేదని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ తెలిపారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నప్పటికీ సభ అనుకున్న ప్రకారం జరుగుతుందని అన్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో 'సమైక్య శంఖారావం' జరగనుంది. కాగా, వరద సహాయ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News