: పంజాబ్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 12 మంది చిన్నారుల దుర్మరణం
పంజాబ్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ ను ఓ ఇటుకల లారీ ఢీకొనడంతో 12 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. కాగా, ఈ దుర్ఘటనలో స్కూల్ వ్యాన్ డ్రైవర్ కూడా ప్రాణాలు విడిచాడు. నకోదర్ పట్టణం సమీపంలోని జహీరా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.