: గుప్తనిధి కోసం నాడు ఇందిర అన్వేషణ


ఉత్తరప్రదేశ్ లోని దాండియాఖేడాలో ఒక కోటలో బంగారం కోసం అన్వేషణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, 1976లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇందిరాగాంధీ కూడా ఇలాగే బంగారం అన్వేషణకు ఆదేశించారట. జైపూర్ రాజ కుటుంబానికి చెందిన జైగఢ్ కోటలో గుప్తనిధి కోసం అన్వేషణ సాగించాలని ఆర్మీని ఆదేశించారు. ఈ విషయం తెలిసిన పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో నిధిలో తమకూ వాటా ఇవ్వాలని కోరుతూ ఇందిరకు లేఖ రాశారట. ఏదేమైనా మూడు నెలల పాటు వేట సాగించినా అక్కడ మాత్రం నిధి లభించలేదు. దీంతో, నాటి నేతల ఆశలు అడియాసలయ్యాయి.

  • Loading...

More Telugu News