: కైకలూరులో 7న టీడీపీ శాసనసభాపక్షం భేటీ
కృష్ణాజిల్లా కైకలూరులో ఈ నెల 7న టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అనంతరం ఈనెల 9న టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ఉంటుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో సమావేశం అక్కడే జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.