: నేడు ప్రధానిని కలవనున్న గవర్నర్ నరసింహన్
ఢిల్లీలో తీరికలేకుండా గడుపుతున్న గవర్నర్ నరసింహన్ ఈ రోజు ప్రధాని మన్మోహన్ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానికి రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ఉద్యమాల తీరు, ప్రభుత్వం తీరుతెన్నులు, స్తంభించిన పాలన, తాజా రాజకీయ పరిస్థితులపై నివేదిక ఇవ్వనున్నారు. నిన్న ఢిల్లీలో క్షణం తీరికలేకుండా గడిపిన నరసింహన్ రాష్ట్రపతి, సోనియాగాంధీ, దిగ్విజయ్ సింగ్, షిండే, చిదంబరం లాంటి పెద్దలతో భేటి అయి కీలకాంశాలపై నివేదికలిచ్చారు.