: శ్రీకాకుళం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం


గత మూడు రోజులుగా ఏకధాటిన కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని నాగావళి, మహేంద్ర తనయ, బహుదా, వంశధార నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. వీటి ధాటికి జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాల పంట పూర్తిగా నీటి పాలైంది. మొన్నటి ఫైలిన్ తుపాను ప్రభావం నుంచి కోలుకోక ముందే మరో తుపాను ముంచెత్తడంతో జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. లావేరు మండలం బుడమూరు దగ్గర పెద్దగడ్డకు భారీగా వరద నీరు చేరుకోవడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News