: హయత్ నగర్ డిపోను ముంచెత్తిన వరద
హైదరాబాద్ లోని హయత్ నగర్ ఆర్టీసీ డిపోలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఈ డిపో నుంచి బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రాంతమంతా చెరువులా మారిపోయింది. స్థానికంగా ఉన్న పలు కాలనీల ఇళ్లలోకి కూడా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.