: పదిలంగా ఉండాలంటే ఈ పరీక్ష తప్పనిసరి


మన దేశంలో 2020 నాటికి మధుమేహ బాధితుల సంఖ్య 3 కోట్లు దాటుతుందని కొన్నేళ్ల క్రితం నిపుణులు అంచనా వేశారు. కానీ 2012 నాటికే వారి సంఖ్య దేశంలో ఏడున్నర కోట్లు దాటేసింది. అంటే మధుమేహం భారతీయుల్లో ఎంతలా చొచ్చుకుపోతుందో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. నేడు ప్రపంచంలో ప్రతి ఐదు మంది మధుమేహ రోగులలో ఒకరు భారతీయులే. తినే ఆహారం, అధిక పనివేళలు, విశ్రాంతి, శారీరక వ్యాయామం తగ్గిపోవడం, వంశపారంపర్యం ఇలా అన్నీ కలిసి దేశాన్ని మధుమేహ భారతంగా మార్చేస్తున్నాయి. 

ఆరోగ్య పరీక్ష - 9
అందుకే ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మధుమేహంపై పోరాడాల్సి ఉంది. ఇందుకోసం తమతో పాటు తమ కుటుంబంలోని వారికీ వయసును బట్టి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించాలి. 20 ఏళ్ల వయసు వారిలోనూ నేడు మధుమేహం బయటపడుతోంది. అందుకే 20ఏళ్లు దాటిన వారికి ఆరు నెలలకు ఒకసారి, 30 ఏళ్లు దాటిన వారికి ప్రతీ మూడు నెలలకు, 40 దాటితే నెలనెలా మధుమేహం ఉందా? లేదా? అన్నది పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. చిన్న రక్తపరీక్ష ద్వారానే మధుమేహం నిర్ధారణ చేస్తారు. దాంతో దీని బారిన పడకుండానే కాపాడుకోవచ్చు. అందుకే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. 

ముందుగా గుర్తిస్తే మందులు, ఆహరంలో మార్పుల ద్వారా మధుమేహాన్ని చక్కగా నియంత్రణలో పెట్టుకోవచ్చు. అసలీ మహమ్మారికి మందుల కంటే ఆహారంలో మార్పులే చక్కటి చికిత్స. దీన్ని సరైన సమయంలో గుర్తించక, సరైన చికిత్స తీసుకోకుండా వదిలేస్తే, శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు అస్తవ్యస్తంగా మారతాయి. ఫలితంగా గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు ఇలా ప్రధాన అవయవాలన్నీ దెబ్బతింటాయి. 

  • Loading...

More Telugu News