: భోజనానంతరం వేడినీరే మంచిది


అన్నం తిన్న తర్వాత వెంటనే కాకుండా కాసేపటికి నీరు తాగితే మంచిదని చాలామంది చెబుతుంటారు. ఇలా తాగేనీరు ప్రిజ్‌ వాటర్‌ కాకుండా చక్కగా వేడి నీరు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణం కావడానికి మన శరీరంలో కొన్ని రకాల ఎంజైములు, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత పావుగంట లేదా ఇరవై నిముషాలకు నీటిని తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా గోరువెచ్చని నీటిని తాగితే మంచిదని చెబుతున్నారు.

అన్నం తిన్న వెంటనే ప్రిజ్‌ వాటర్‌ తాగడం వల్ల గుండెపోటు, క్యాన్సర్‌ వంటి రోగాలు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా అజీర్తి, కొలెస్టరాల్‌ పెరగడం వంటివి ఎక్కువగా ఉంటాయని, గుండెకు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గుండెకు ఎంతో మంచిదని, దీనివల్ల క్యాన్సర్‌ సెల్స్‌ ఉత్పత్తిని నిరోధించవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. చైనీయులు, జపనీస్‌ ఆహారం తీసుకున్న తర్వాత గ్రీన్‌ టీ లేదా గోరువెచ్చని నీటిని తీసుకుంటారు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. దీనికితోడు గోరువెచ్చని నీరు కొలెస్టరాల్‌ను నిరోధించగలుగుతుంది. కాబట్టి ఆహారం తిన్న తర్వాత చక్కగా గోరువెచ్చని నీటిని తాగితే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News