: నొప్పిలో కూడా ఆడా, మగా తేడా ఉంటుందట!


ఏదైనా దెబ్బ తగిలితే కలిగే నొప్పి కూడా ఆడవారికి మగవారికి వేరువేరుగా ఉంటుందా... అంటే అవుననే చెబుతున్నారు పరిశోధకులు. నొప్పి తీవ్రత మగవారిలోకంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ఇరువురికి వేరు వేరుగా మందులు ఉండాలని, వేరు వేరు చికిత్సా విధానాలు కూడా ఉండాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో నొప్పుల తీవ్రత విషయంలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం స్పష్టంగా తేలింది. తీవ్రమైన నొప్పులతో బాధపడే మహిళలకు సంక్లిష్టమైన చికిత్స అవసరం పడుతుందని, ఇలాంటి వారితో పోలిస్తే పురుషులకు కాస్త సులువైన చికిత్సతో పరిస్థితి మెరుగు పడుతుందని తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. అంటే నొప్పులకు సంబంధించి చికిత్సల విషయంలో కూడా స్త్రీ పురుష భేదం తప్పనిసరిగా పాటించాల్సిందేనని, ప్రాథమికంగా నొప్పుల తీవ్రత, బాధ మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని, ఇందుకు కారణం గ్లియల్‌ కణాలు (మెదడులోని రోగనిరోధక కణాలు) పనితీరు స్త్రీ, పురుషుల్లో వేరేవేరుగా ఉండటమేనని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News