: రాష్ట్రపతితో ముగిసిన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ ముగిసింది. దాదాపు అర్ధగంట పాటు జరిగిన ఈ సమావేశంలో 30 మంది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భేటీ అనంతరం రాష్ట్ర మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ, విభజన అంశంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రపతిని కోరామని తెలిపారు. రాష్ట్రాల విభజనలో గతంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడూ పాటించాలని రాష్ట్రపతికి విన్నవించామని పేర్కొన్నారు.