: 'ప్రేమగీతం' ఆలపించకుండానే కన్నుమూసిన మధుర గాయకుడు
మధుర గాయకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన్నాడే తన కోరిక తీరకుండానే కన్నుమూశారు. ఆయన భార్య సులోచన ఏడాది క్రితం కేన్సర్ వ్యాధితో కన్నుమూసింది. భార్య జ్ఞాపకార్థం మన్నా డే ఓ ప్రేమగీతం ఆలపించి రికార్డు చేయాలనుకున్నా ఆరోగ్యం సహకరించలేదు. స్వస్థత చేకూరిన తర్వాత పాడాలనుకున్నా దురదృష్టం అడ్డుతగిలింది. ఊపిరితిత్తుల వ్యాధి రూపంలో ఆయన ప్రాణాలను కబళించివేసింది. గత కొంతకాలంగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నాడే ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. జన్మతః బెంగాలీ అయిన మన్నాడే వేలాది పాటలు పాడి, సంగీత ప్రేమికుల అభిమానానికి పాత్రుడయ్యారు. ఆయన ప్రతిభను గుర్తిస్తూ.. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది.