: లైన్ అండ్ లెంగ్త్ పై దృష్టిపెట్టా: షమి
రాంచీ వన్డే వర్షం కారణంగా నిలిచిపోయినా, టీమిండియా పేసర్ మహ్మద్ షమి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 8 ఓవర్లు విసిరి 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. కాగా, వరుణుడి ప్రతాపంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే నిలిచిపోయింది. మ్యాచ్ అనంతరం షమి మీడియాతో మాట్లాడుతూ.. లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి బౌలింగ్ చేయడం సత్ఫలితాన్నిచ్చిందన్నాడు. ప్రమాదకర బ్యాట్స్ మన్ ఫించ్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నానని తెలిపాడు. అతనితో బంతులను ఆడించాలన్నది తమ వ్యూహమని, ఆ ప్లాన్ వర్కౌటైందని చెప్పాడు. మ్యాచ్ కు ముందు కూడా వర్షం పడడంతో పిచ్ కొద్దిగా మందగించిందని, అయితే, ప్రాథమిక అంశాలను పాటిస్తూ బౌలింగ్ చేయడంతో వికెట్లు దక్కాయని వివరించాడీ బెంగాల్ పేసర్. ఈ మ్యాచ్ లో షమి 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయడంతో కంగారూ టాపార్డర్ విలవిల్లాడిన సంగతి తెలిసిందే.