: రాష్ట్రపతితో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఆరుగురు రాష్ట్ర మంత్రులు, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహా 30 మంది ప్రజాప్రతినిధులు ప్రణబ్ ను కలిసిన వారిలో ఉన్నారు. విభజనను వ్యతిరేకిస్తున్న వీరు తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, ఆ అంశాన్ని పరిశీలించాలంటూ రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలుస్తోంది.