: ఆ పేసర్ తో జాగ్రత్త: బ్యాట్స్ మెన్ కు బెయిలీ సూచన


బెంగాల్ పేసర్ మహ్మద్ షమిని జరగబోయే మ్యాచ్ లలో జాగ్రత్తగా ఎదుర్కోవాలని బ్యాట్స్ మెన్ కు సూచిస్తున్నాడు ఆసీస్ కెప్టెన్ జార్జ్ బెయిలీ. నిన్న రాంచీలో వర్షం వల్ల ఆగిపోయిన మ్యాచ్ లో కొత్త బంతితో షమి కంగారూ టాపార్డర్ ను కకావికలం చేసిన సంగతి తెలిసిందే. షమి ఆసీస్ ఇన్నింగ్స్ లో తొలి మూడు వికెట్లు తీసి ప్రమాద హెచ్చరికలు జారీ చేశాడు. అందుకే, అతనితో తర్వాతి వన్డేల్లో ముప్పు తప్పదని బెయిలీ భావిస్తున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ ఆసీస్ సారథి మీడియాతో మాట్లాడుతూ, తాము ఊహించిన దానికంటే షమి ఎక్కువ పేస్ తో బంతులు విసురుతున్నాడని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News