: సంపన్న భారతీయుల జాబితాలో మళ్ళీ ముఖేష్ అంబానీయే టాప్
పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మరోసారి భారతీయ సంపన్నుల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచారు. రూ.1.1 లక్షల కోట్ల (18.9 బిలియన్ డాలర్లు) వ్యక్తిగత ఆస్తులతో ఆయన ఈ స్థానాన్ని నిలుపుకున్నారు. చైనాకు చెందిన 'హురూన్ ఇండియా రిచ్ లిస్ట్' సంస్థ తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో ముఖేష్ రెండోసారి ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. కాగా, లండన్ కు చెందిన స్టీల్ దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ 15.9 బిలియన్ డాలర్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇక, సన్ ఫార్మాస్యూటికల్స్ స్థాపకుడు దిలీప్ శాంగ్వీ తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన తృతీయ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ (12 బిలియన్ డాలర్లు) ఉన్నారు.