: నరేంద్రమోడీ మంచి ప్రధాని కాలేరు: జావేద్ అక్తర్


బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీపై బాలీవుడ్ రచయిత, రాజ్యసభ సభ్యుడు జావేద్ అక్తర్ తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి మోడీ మంచి ప్రధానమంత్రి కాలేరన్నారు. మత అల్లర్లలో కళంకితుడిగానే కాక అప్రజాస్వామ్య వ్యక్తి అని వ్యాఖ్యానించారు. పాట్నాలోని ఓ పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న జావేద్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనపై ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతోందని, ఇంకా ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయని, ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి సరి కాదన్నారు. గుజరాత్ లో హ్యట్రిక్ కొట్టి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా ఆ రాష్ట్రంలో సరైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారని పేర్కొన్నారు. గుజరాత్ లో మంత్రులను మోడీ ఛప్రాసీలుగా చూస్తారని, ఇటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి దేశాన్నెలా పాలించగలరని జావెద్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News