: సీబీఐటీ క్యాంపస్ లో 'తెలంగాణ' రగడ


హైదరాబాదు శివారులోని సీబీఐటీ కళాశాలలో 'తెలంగాణ' చిచ్చు రేగింది. ఈ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న పి.రామకృష్ణారెడ్డి, పి.సూర్యనారాయణరెడ్డి తెలంగాణ జేఏసీ పేరిట ఈ నెల 25న కళాశాలలో ఓ సభ జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం వారు సీబీఐటీ పాలక వర్గానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కళాశాల ఆవరణలో ఇలాంటి సభలకు అనుమతి లేదని సీబీఐటీ పాలక కమిటీ ఆ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లకు స్పష్టం చేసింది. కానీ, వారు వెనక్కు తగ్గకపోవడంతో సీబీఐటీ విద్యాసంస్థ అధ్యక్షుడు మాలకొండారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సీబీఐటీ క్యాంపస్ లో ఈ నెల 25 వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News