: రాష్ట్రపతిని కలసిన సోనియాగాంధీ
రాష్ట్ర విభజన విషయమై సీమాంధ్ర నేతలు ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతిని కలవనుండటంతో ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. ఈ విషయమై హైకమాండ్ కూడా కొంత కలవరపాటుతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సోనియాగాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మన రాష్ట్ర విభజనపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కళంకిత నేతల ఆర్డినెన్స్ ను రాహుల్ వ్యతిరేకించడం, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు లాంటి విషయాలపైనా వీరిరువురూ చర్చించినట్టు సమాచారం. కాగా, రాష్ట్ర విభజన విషయంలో ఇప్పుడు వెనకడుగు వేస్తే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని రాష్ట్రపతికి సోనియా విన్నవించినట్టు తెలుస్తోంది.