: వేధింపుల కేసులో గద్దర్ అల్లుడు అరెస్ట్
ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను వేధించిన కేసులో ఆమె భర్త ఎం.రవికుమార్ ను సికింద్రాబాద్ అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పన్నెండు సంవత్సరాల కిందట వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారని.. అయితే, కొన్నాళ్ల నుంచి రవికుమార్ వేధిస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. దాంతో, రవికుమార్, అతని సోదరుడు వినోద్ లను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపినట్లు వెల్లడించారు. వెన్నెల ఓ ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.