: శ్రీలంకను కామన్వెల్త్ కూటమి నుంచి తొలగించాలి: తమిళనాడు
పొరుగుదేశం శ్రీలంకపై తమిళనాడు ఇంకా మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అక్కడి తమిళుల పట్ల లంక తీరు సరిగా లేకపోవడంతో కామన్ వెల్త్ దేశాల కూటమి నుంచి ఆ దేశాన్ని తొలిగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని చేశాయి. అంతేగాకుండా, వచ్చేనెలలో కొలంబోలో జరగనున్న కామన్ వెల్త్ సమావేశాలను భారత్ బహష్కరించాలని కూడా తమిళ పార్టీలు ప్రధాని మన్మోహన్ కు సూచించాయి. లంకలో తమిళులకు సమాన హక్కులు కల్పించేలా కేంద్రం బలమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఆ పార్టీలు కోరాయి.