: తాగుడు మాన్పించడానికి చెట్టుకు వేలాడదీశారు


జితేంద్ర చౌదరి జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో పట్టణంలో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడు తాగుడుకు బానిసయ్యాడు. రోజూ పీకలదాకా తాగొచ్చి భార్యను వేధించుకు తింటున్నాడు. తాగుడు మానమని బతిమాలినా, కోప్పడినా ఏ మాత్రం మార్పు లేదు. అతడి తీరుతో విసిగిపోయిన భార్య సహాయం కోరుతూ స్థానిక ముక్తిమోర్చా ఎమ్మెల్యే జగన్నాథ్ దగ్గరకు వెళ్లింది.

ఆయన తాగుబోతుకి ప్రత్యేకశిక్ష వేశారు. అతడిని చెట్టుకు వేలాడదీశారు. తాగుడు వల్ల అతడి కుటుంబం గుల్లయ్యిందని జగన్నాథ్ చెప్పారు. అందుకే తన పద్ధతి మార్చుకునేందుకు చెట్టుకు వేలాడదీశామని చెప్పారు. మారినప్పుడే అతడికి విముక్తి అని తేల్చి చెప్పారు. శిక్ష అదిరింది కదూ?

  • Loading...

More Telugu News