: టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టు దారుణం: చంద్రబాబు
ఎడతెరపిలేని వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వర్షాల కారణంగా నష్టపోయిన వారిని తక్షణం ఆదుకొనేలా చర్యలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడి పలుచోట్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సచివాలయం వద్ద ధర్నా చేసినందుకు అరెస్టయి ప్రస్తుతం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలను బాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టు దారుణమన్నారు. నీలం తుపాను బాధితులకు ఇంతవరకు నష్ట పరిహారం ఇవ్వలేదన్న చంద్రబాబు.. కొందరు నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు.