: సహాయక చర్యలు చేపట్టండి: పార్టీ శ్రేణులకు జగన్ సూచన
వరదబాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించాలని ఆయన కోరారు. ఈ మేరకు పలు జిల్లాల నాయకులతో ఆయన మాట్లాడి వారిని సమాయత్తం చేశారు. ఒంగోలులో స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. వరదలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.