: లెక్కల టీచర్ ను హత్య చేసిన విద్యార్థి
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని డెన్వర్ హైస్కూల్ లో లెక్కల టీచర్ ను 14 ఏళ్ళ విద్యార్థి హత్య చేశాడు. మంగళవారం రాత్రి నుంచి లెక్కల టీచర్ కొలీన్ రిట్జర్ కన్పించడం లేదు. ఫోన్ కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, గాలింపు చేపట్టిన పోలీసులకు రిట్జర్ మృతదేహం పాఠశాల వెనుక ఉన్న అటవీప్రాంతంలో దొరికింది. సీసీటీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులకు ఫిలిప్ చిస్మ్ అనే విద్యార్థి ఈ హత్య చేసినట్టు ఆధారాలు లభించాయి. దీంతో, అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అతడికి బెయిల్ ఇవ్వకుండా పోలీసుల అదుపులోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఈ వారంలో లెక్కల టీచర్లు హత్యకు గురవడం ఇది రెండోసారి. నెవాడాలోని రెనో స్కూల్ లో సోమవారం ఓ 12 ఏళ్ల విద్యార్థి కూడా లెక్కల టీచర్ ను మట్టుబెట్టాడు.