: టాయిలెట్ లో వాడేందుకు బంగారు పేపర్
ఆవిష్కరణలు వింత పోకడలు పోతున్నాయి. మరుగుదొడ్డిలో శానిటరీ పేపర్ (టిస్యూ పేపర్) వాడడం తెలిసిందే కదా. కానీ, ఓ ఆస్ట్రేలియా కంపెనీ ఈ పేపర్ ను బంగారంతో చేసి ఔరా అనిపించింది. 22 కేరట్ల బంగారంతో కేవలం ఒక్క టాయిలెట్ పేపర్ చుట్టనే తయారు చేసింది. దీని ధర మన రూపాయల్లో చెప్పాలంటే అక్షరాలా 85 లక్షల రూపాయలు. దుబాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో టాయిలెట్ సీట్లు బంగారంతో చేసినవీ ఉంటాయి. ఈ ఆస్ట్రేలియా కంపెనీ ఆ బంగారు టాయిలెట్లను చూసే బంగారంతో పేపర్ ను తయారు చేసింది. పని అయ్యాక శుభ్రం చేసుకోవడం విసిరి పారేయడం! అంతే.