: విభజన తరువాత.. ముందు వరదసాయం అందించండి: టీడీపీ నేతలు


సచివాలయం సీ బ్లాకు మందు టీడీపీ సీమాంధ్ర నేతలు ధర్నాకు దిగారు. విభజన లెక్కలు తరువాత చూడాలని, ముందుగా వరద సాయం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఓవైపు, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారని, వారికి సాయంగా అధికారులను పంపాల్సింది పోయి.. విభజనకోసం చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులను ఢిల్లీకి పంపుతున్నారని వారు మండిపడ్డారు. గవర్నర్ సోనియాకు గులాంగిరీ చేస్తున్నాడని మండిపడ్డారు. సర్కారు.. విభజన, అధిష్ఠానం ప్రయోజనాల మీద చూపుతున్న శ్రద్థ రాష్ట్ర ప్రజల మీద చూపట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షల పేరుతో కాలం గడిపేస్తే రైతులను ఆదుకున్నట్టా?' అని వారు ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News