: వర్షాలకు 10 మంది మృతి..2.5 లక్షల హెక్టార్ల పంట నష్టం: రఘువీరా
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు 10 మంది మృత్యువాత పడ్డారని రెవెన్యూ శాఖా మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. భారీ వర్షాలపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ వర్షాలకు 300 ఇళ్లు దెబ్బతిన్నాయని అన్నారు. 2.5 లక్షల హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని తెలిపారు. అలాగే, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 6,500 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. అధికారులను అప్రమత్తం చేశామని, మత్స్యకారులను హెచ్చరించామని రఘువీరా తెలిపారు. 19 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.