: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
హైదారాబాదులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నల్గొండ జిల్లా బీబీనగర్ మండలంలోని రుద్రవెల్లి, భట్టుగూడెం గ్రామాల్లోని వంతెనలపై నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. దీంతో, భువనగిరి, బీబీనగర్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.