: కమాన్, షీలా మేడమ్.. బహిరంగంగా చర్చిద్దాం: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనతో బహిరంగ చర్చకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ నేడు ఆహ్వానించారు. ఢిల్లీలో మహిళల రక్షణ, నీటి, విద్యుత్ ఛార్జీల పెంపు తదితర అంశాలపై సీఎం షీలా దీక్షిత్ బహిరంగ చర్చకు రావాలని కేజ్రీవాల్ గతంలోనూ డిమాండ్ చేశారు. ఇందుకు తాను సిద్దంగా ఉన్నానని షీలా దీక్షిత్ ఇటీవలే ఓ టీవీ చానల్లో ప్రకటించారు. గత ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత సుష్మాస్వరాజ్తో బహిరంగ చర్చలో పాల్గొన్న విషయాన్ని షీలా గుర్తు చేశారు. దీంతో, కేజ్రీవాల్ మరోసారి షీలాను చర్చకు ఆహ్వానించారు.