: పాక్ వంటల్లో ఒబామాకు ప్రవేశం


అమెరికా అధ్యక్షుడు అందరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పారు. తనకు పాక్ వంటలు కూడా వచ్చన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు. నిన్న వైట్ హౌస్ లో వీరిరువురు సమావేశమయ్యారు. పాక్ పర్యటనకు రావాలని ఒబామా దంపతులను నవాజ్ షరీఫ్ కోరారు. పాక్ వంటకాల రుచి చూడాలని కోరారు. దీంతో, ఒబామా కాలేజీ రోజుల్లో పాక్ లో పర్యటించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

1980కు ముందు తాను పాక్ లో పర్యటించానని ఒబామా.. షరీఫ్ కు చెప్పారు. కాలేజీ రూమ్మేట్స్ ఇద్దరూ పాకిస్థానీలని, కనుక అప్పట్లో పాకిస్థాన్ లో పర్యటించానని తెలిపారు. ఆ సందర్భంగా రూమ్మేట్స్ తల్లుల సాయంతో దాల్, కీమాతో పాటు ఇతర పాకిస్థానీ వంటలను తయారు చేయడం నేర్చుకున్నానని వివరించారు. ఆ పర్యటనను అద్భుతమైనదిగా పేర్కొన్నారు. కాగా, ఒబామా దంపతులు పాకిస్థాన్ వస్తే, వారికోసం దాల్, కీమా ఎదురుచూస్తుంటాయని షరీఫ్ అన్నారు.

  • Loading...

More Telugu News