: జైరాం రమేశ్ కు మోడీ ఇన్విటేషన్


కేంద్ర గామ్రీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ కు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని పంపారు. దక్షిణ గుజరాత్ లోని నర్మదా జిల్లా కేవదియ కాలనీలో స్వాతంత్ర్య సమరయోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఈనెల 31న భూమిపూజ జరగనుంది. ఈ నేపథ్యంలో, జైరాంను ఆహ్వానిస్తూ మోడీ లేఖ రాశారు. డియర్ జైరాం జీ.. అంటూ ప్రారంభించిన మోడీ.. విగ్రహం ఏర్పాటు దేశ సాంస్కృతిక, సామాజిక జీవనంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని తాము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News