: ఒబామా ముందు పరువు తీసేశావ్: షరీఫ్ పై విరుచుకుపడ్డ పాకిస్థానీలు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తమ దేశ పరువు తీసేశాడని పాకిస్థానీలు వాపోతున్నారు. రెండు ముక్కలు మాట్లాడటానికి కూడా పేపర్ పై రాసుకుని చదవాలా? అని ప్రశ్నిస్తున్నారు. నిన్న అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయిన తర్వాత షరీఫ్, ఒబామా జాయింట్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంలో షరీఫ్ పేపర్ పై రాసుకున్న చిన్న నోట్ ను చదివి వినిపించారు. దీంతో, పాకిస్థానీలు అగ్గిమీద గుగ్గిలమైపోయారు. చిన్న విషయాన్ని చెప్పడానికి కూడా నోట్ పై ఆధారపడటం... ఆత్మగౌరవాన్ని చంపుకోవడమేనని భావిస్తున్నారు. తమ వ్యతిరేకతను వెల్లడించడానికి ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నారు. షరీఫ్ ప్రసంగం పూర్తయిన కొన్ని క్షణాల్లోనే... పాకిస్థానీలు తమ కామెంట్లతో ట్విట్టర్ ను హోరెత్తించారు. మచ్చుకు కొన్ని పాకిస్థానీల కామెంట్లు చూద్దాం.
హలీమా నవాజ్ : ప్రసంగించడానికి ఫరీఫ్ కు నోట్స్ కావాలి. అయితే, ప్రజాస్వామ్యంపై ఆయన మాట్లాడింది మాత్రం శూన్యం. ఈనాటి పాక్ ప్రభుత్వ వ్యవహారశైలికి నేను సిగ్గుపడుతున్నా.
తాజియో నువోలారి : ఓయ్ షరీఫ్, నీ గురించి సిగ్గుపడుతున్నా. నోట్స్ లేకుండా కొన్ని లైన్లు కూడా నీవు మాట్లాడలేవా?
మొహమ్మద్ షఫి : నవాజ్ షరీఫ్... నీవు మాట్లాడిన లైన్లు నీకు గుర్తుంటాయా?
సర్మద్ గిలానీ : ఒబామా ఎదురుగా పేపర్ మీద రాసుకుని పబ్లిగ్గా చదవడం... నిజంగా షాకింగ్. ఒళ్లు జలదరిస్తోంది.
ఆరిఫ్ రఫీక్ : ఒబామా చాలా క్లియర్ గా, డీటెయిల్డ్ గా మాట్లాడాడు. నీవేమో పేపర్ పై రాసుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడావు.
ఇంతకంటే దారుణమైన కామెంట్లను వేలాదిగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం ద్వారా పాకిస్థానీలు తమ బాధను వెలిబుచ్చారు.