: రోగి ప్రాణం తీసిన హాస్పిటల్ కు రూ.5.96 కోట్ల జరిమానా
నిర్లక్ష్యంతో రోగి ప్రాణం పోయేందుకు కారణమైన కోల్ కతాలోని ఏఎంఆర్ఐ హాస్పిటల్ 5.96 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్ఆర్ఐ డాక్టర్ కునాల్ తన భార్య డాక్టర్ అనురాధ సాహా(36)ను చికిత్స కోసం ఏఎంఆర్ఐలో చేర్పించగా.. ఆమె 1998 మే నెలలో కన్నుమూశారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఉందని సుప్రీం కోర్టు నిర్ధారించింది. దీంతో, ఆమెకు చికిత్స చేసిన ముగ్గురు డాక్టర్లు ఒక్కొకరు రూ. 10 లక్షల వంతున డాక్టర్ కునాల్ కు పరిహారంగా చెల్లించాలని, మిగతా మొత్తం హాస్పిటల్ యాజమాన్యం చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.