: తిరుమలేశుడిని దర్శించుకున్న తమన్నా
సినీనటి తమన్నా సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కుటుంబ సభ్యులతో తిరుమల వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు నైవేద్య విరామ సమయంలో వెంకటేశ్వరుడి దర్శనం కల్పించారు. బాలీవుడ్ లో నటించిన తొలి చిత్రం 'హిమ్మత్ వాలా' కొన్నిరోజుల్లో విడుదల కానుండడంతో స్వామివారి దర్శనానికి వచ్చినట్లు తమన్నా మీడియాకు తెలిపింది. కాగా మరో రెండు హిందీ చిత్రాల్లోనూ అవకాశం వచ్చిందని సంతోషంగా చెప్పింది.