: ఢిల్లీ-ముంబయి మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం


ఇప్పటివరకు ఢిల్లీ, ముంబయి మధ్య నడిచే రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్ళ వేగం 130 నుంచి 150 కి.మీ. మాత్రమే. ఇకపై ఆ మూడు రైళ్ళు దూసుకెళ్ళనున్నాయి. వాటి వేగం పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. తద్వారా అవి 160-200 కి.మీ వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయనున్నాయి. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో ఢిల్లీ-ముంబయి మధ్య ప్రయాణ సమయం 17 గంటల నుంచి 14 గంటలకు తగ్గనుంది. అంటే, ప్రయాణికులకు మూడు గంటల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం ఢిల్లీ-ముంబయి మార్గాన్ని రైళ్ళ వేగానికి అనువుగా ఆధునికీకరిస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News