: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిపివేత
మూడు రోజుల నుంచి పడుతున్న వర్షాలకు వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిలో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా దాదాపు 9 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. బొగ్గుగని నిండుకుండలా మారడం, సైడ్ వర్మన్ బెంచ్ (మట్టిరోడ్డు) తడిసి జారుతుండడంతో డంపర్లు లోపలికి వెళ్లలేకపోతున్నాయని చెప్పారు.