: వరద బీభత్సంపై ఫోన్ లో సీఎస్ తో ముఖ్యమంత్రి సమీక్ష
రాష్ట్రంలో కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రకాశం జిల్లా ఎదురుళ్లపాడులో వరదలో చిక్కుకున్న వారిని రక్షించాలని ఆదేశించారు. అటు భారీ వర్షాలు, వరదలపై మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.