: ప్రకాశం జిల్లాలో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు: ఐదుగురు గల్లంతు
హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న మార్కాపురానికి చెందిన ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా కొణకనమిట్ల మండలంలోని ఎదురాళ్లపాడు వద్ద మూసీవాగులో చిక్కుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఐదుగురు గల్లంతయ్యారని తెలుస్తోంది. మరో 8 మంది మంది ప్రయాణికులు బస్సుపైకి ఎక్కి రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. కొణకనమిట్ల, ఎదురాళ్లపాడు, కొత్తపల్లి గ్రామాలకు చెందిన పలువురు యువకులు బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎస్.ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.