: మనం నివసించడానికి మరో 12 గ్రహాలున్నాయట


మనం నివసించడానికి విశ్వంలో మరేవైనా గ్రహాలు ఆవాసయోగ్యంగా ఉన్నాయా? అని శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో 12 గ్రహాలు మనం నివసించడానికి యోగ్యంగా ఉండే అవకాశం ఉన్నట్టు తేలింది. మనం నివసించే సౌరకుటుంబానికి వెలుపలగా శాస్త్రవేత్తలు వేలల్లో గ్రహాలను గుర్తించారు. ఇప్పటికి శాస్త్రవేత్తలు గుర్తించిన గ్రహాల సంఖ్య 1,010కి చేరుకుంది. ఈ గ్రహాల వివరాలతో కూడిన ఒక జాబితాను పోర్టోరికో విశ్వవిద్యాలయానికి చెందిన ప్లానెటరీ హ్యాబిటబిలిటీ ల్యాబొరేటరీ ఇటీవల విడుదల చేసింది. ఈ గ్రహాల్లో 12 గ్రహాలు మానవ నివాసానికి యోగ్యంగా ఉన్నాయని ఇందులో తెలిపింది.

అంటే ఈ గ్రహాలు తమ తమ నక్షత్రాలకు మరీ అంత దగ్గరగా గానీ, లేదా మరీ అంత దూరంగా గానీ లేకుండా ఒక నిర్ణీత దూరంలో అంటే సూర్యుడి నుండి మన భూమిలాగా ఉన్నాయట. దీనివల్ల ఈ గ్రహాలు మరీ వేడిగానీ, లేదా మరీ చల్లగా గానీ ఉండవని, ఫలితంగా వీటి ఉపరితలంపై నీరు ద్రవస్థితిలో ఉండగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌరకుటుంబానికి అవతల మనం గుర్తించిన గ్రహాల సంఖ్య త్వరలోనే 3,500 కు పెరిగే అవకాశం ఉందని పోర్టోరికో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇప్పటికే ఉన్నప్పటికీ వాటిపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా సౌరకుటుంబం వెలుపల ఉన్న గ్రహాలను గుర్తించడంలో నాసాకు చెందిన కెఫ్లర్‌ టెలిస్కోపు కీలక పాత్ర పోషిస్తోంది.

  • Loading...

More Telugu News