: అంగారకుడు అలా ఎలా మారాడంటే...


అంగారక గ్రహం ఇప్పుడున్న వాతావరణ పరిస్థితికి ఎలా మారింది? అనే విషయాలను గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనల్లో అంగారకుడి గ్రహశకలం ద్వారా అక్కడి ఒకప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులకు ఎలా మారాయి? అనే విషయాలు వెల్లడయ్యాయి.

1931లో అమెరికాలోని ఇండియానాలో అంగారకుడికి చెందిన 4.5 సెంటీమీటర్ల గ్రహశకలం ఒకటి దొరికింది. ఇది దాదాపు మూడువేల ఏళ్ల క్రితం భూమిని ఢీకొందని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. దీన్ని ఇంతకాలంగా లండన్ లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియంలో భద్రపరిచారు. స్కాటిష్‌ విశ్వవిద్యాలయాల పర్యావరణ పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని తీసుకుని కొంతకాలం పాటు దీనిపై పరిశోధనలు సాగించారు.

ఈ పరిశోధనల్లో అంగారక గ్రహంపై కర్బనీకరణ అనే రసాయన ప్రక్రియ విస్తృతంగా జరిగినట్టు గుర్తించారు. ఖనిజాలు నీటితో కలిసినప్పుడు వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను శోషించుకోవడమే కర్బనీకరణ. దీనివల్ల అంగారకుడి వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదు క్రమేణా అంతరించిపోయింది. అదే సమయంలో ఆ గ్రహం అయస్కాంత క్షేత్రాన్ని కోల్పోవడం కూడా అక్కడి వాతావరణం పూర్తిగా కనుమరుగు కావడానికి కారణమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడిపై జరిగిన ఈ పరిణామాలను అధ్యయనం చేయడం ద్వారా భూమిమీద కార్బర్‌డయాక్సైడ్‌ను తగ్గించుకుని భూతాపం సమస్యను పరిష్కరించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News